బీజేపీని చూసి ఎక్కువగా ఆందోళన చెందొద్దు: పార్టీ నేతలతో కేసీఆర్
- బీజేపీని చూసి హైరానా పడొద్దు
- ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు
- బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
దుబ్బాకలో బీజేపీ గెలుపు గురించి హైరానా పడొద్దని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత లేదని చెప్పారు. బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... వారి ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని అన్నారు.
మరోవైపు రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్ వరదలు, వర్షాల వల్ల పంట నష్టంపై ఈ భేటీలో చర్చించనున్నారు. డిసెంబర్ తొలి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.