కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం బాధను కలిగించింది: జగన్
- బాధ్యులైన పోలీసులను అరెస్ట్ చేశాం
- నిందితులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాం
- ముస్లింలను అభిమానించేది వైసీపీ మాత్రమే
న్యాయం ఎవరికైనా ఒకటేనని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరామని చెప్పారు. ప్రభుత్వంపై కొందరు బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్, జూమ్ లో మాత్రమే మైనార్టీలపై ప్రేమను చూపిస్తున్నారని... ముస్లింలను అభిమానించే పార్టీ కేవలం వైసీపీ మాత్రమేనని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే ముస్లింలను చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు.