అశ్రునయనాలతో అంతిమయాత్ర... ర్యాడ మహేశ్ పాడె మోసిన మంత్రి వేముల, ఎంపీ అర్వింద్

  • ఉగ్రవాదులతో జరిగిన పోరులో మహేశ్ వీరమరణం
  • ఈ రోజు అంత్యక్రియలు 
  • భారీగా హాజరైన గ్రామస్థులు
జమ్మూకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన పోరులో నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ ర్యాడ మహేశ్‌(26) వీర మరణం పొందిన విష‌యం విదితమే. జ‌వాన్ మ‌హేశ్  అంత్యక్రియలు ఈరోజు ఆయన  కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాలతో కొనసాగుతున్నాయి.

ఆయన గ్రామ శివారులోని వైకుంఠధామం వరకు అంతిమయాత్ర కొనసాగగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ ఆర్వింద్‌ ఆయన పాడె మోశారు. సమీప గ్రామాల ప్రజలు కూడా మహేశ్‌ అంతిమయాత్రలో భారీగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ సీపీ కార్తికేయ పర్యవేక్షణలో 150 మందికి పైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే పెద్ద సంఖ్యలో పోలీసులు కోమన్‌పల్లికి చేరుకున్నారు.

.

Vemula Prashanth Reddy
Arvind
Telangana

More Telugu News