తొమ్మిదో రౌండులో కూడా బీజేపీదే ఆధిక్యత.. 4 వేల మెజార్టీని దాటిన రఘునందన్ రావు
- తొమ్మిదో రౌండులో బీజేపీకి 1,084 ఓట్ల ఆధిక్యత
- మొత్తంమీద 4,190 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్న బీజేపీ
- నిరాశలో కాంగ్రెస్ శిబిరం
మొత్తంమీద బీజేపీకి ఇప్పటి వరకు 29,291 ఓట్లు, టీఆర్ఎస్ కు 25,101 ఓట్లు, కాంగ్రెస్ కు 5,800 ఓట్లు పడ్డాయి. తొమ్మిదో రౌండు ముగిసే సరికి రఘునందన్ రావు 4,190 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మరోవైపు, గెలుపు తమదేనని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడో స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ శిబిరం నిరాశలో మునిగిపోయింది.