హీరోయిన్ పూజ హెగ్డే గురించి చిన్నారి ఆసక్తికర వ్యాఖ్యలు.. సంబరపడి వీడియో పోస్ట్ చేసిన హీరోయిన్
- తాను పెద్దయ్యాక హీరోయిన్ అవుతానన్న పాప
- హీరోయిన్ అయితే బాగా డ్యాన్స్ చేయొచ్చని వ్యాఖ్య
- పూజ అందంగా ఉంటుందని చెప్పిన పాప
ఆమె అందంగా ఉంటుందని, ఆమె అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. దీనిపై పూజ హెగ్డే స్పందిస్తూ... ఓ మైగాడ్ అని సంబరపడిపోయింది. ఆ పాప వీడియోతో తనరోజు పరిపూర్ణం అయిందని చెప్పింది. ఆ పాప బుగ్గలు చాలా ముద్దుగా ఉన్నాయని చెప్పింది. ఏదో ఒకరోజు కచ్చితంగా ఆమెను కలుస్తానని తెలిపింది. అప్పటివరకు తన లవ్‌ను, ముద్దులను ఈ ట్వీట్ ద్వారా పంపిస్తున్నానని చెప్పింది. కాగా, 'అల వైకుంఠపురములో' సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న పూజ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది.