Nara Lokesh: కొన్ని మతాల వారిని పనిగట్టుకొని వేధించడమే పనిగా పెట్టుకున్నారు: జగన్ సర్కారుపై లోకేశ్ విమర్శలు

lokesh slams ap govt
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘కొన్ని మతాల వారిని పనిగట్టుకొని వేధించడమే పనిగా పెట్టుకున్నారు వైఎస్ జగన్. అడ్డంగా న‌రికేసి.. అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు చేయ‌డం వైకాపా స‌ర్కారుకి అల‌వాటుగా మారింది. నంద్యాల‌లో ముస్లిం మైనారిటీ అబ్దుల్ స‌లాం కుటుంబాన్ని వెంటాడి హింసించి సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డేలా చేసి... ఇప్పుడు ప‌రిహారం ప్ర‌క‌టించారు జ‌గ‌న్‌రెడ్డి గారు. బంగారు భ‌విష్య‌త్తు గ‌ల 14 ఏళ్ల కూతురు సల్మా, 12 ఏళ్ల కుమారుడు కలందర్ ని మీ 25 లక్షల రూపాయలు వెనక్కి తీసుకొస్తాయా జగన్ రెడ్డి గారూ? ఏపీలో ముస్లిం మైనారిటీల‌పై దాడుల‌కు అంతే లేకుండా పోయింది

‘శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ గారిని మండ‌లిలోనే ఘోరంగా అవ‌మానించిన స‌ర్కారు ఇది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో త‌న కూతురిని వేధించిన వారిపై ఫిర్యాదు చేసిన తండ్రి సత్తార్ ఎస్పీ కార్యాల‌యం ఎదుటే ఆత్మ‌హ‌త్యాయత్నానికి పాల్ప‌డితే స్పందించే వారే లేరు. అబ్దుల్ స‌లాం గారి కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కాపాడే ప్రయత్నాలు ఆపి కఠినంగా శిక్షించాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News