మిల్క్ డెయిరీలో పాలతో స్నానం చేసిన ఘనుడు... కటకటాల వెనక్కి చేరాడు!
- టర్కీలో ఘటన
- ప్యాక్ చేయాల్సిన పాలతో స్నానం చేసిన కార్మికుడు
- వీడియో తీసిన మరో కార్మికుడు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఓ కార్మికుడు మిల్క్ డెయిరీలోని ఓ టబ్బులో పాలు నింపుకుని వాటితో ఎంచక్కా స్నానం చేశాడు. అతడు స్నానం చేస్తుంటే మరో కార్మికుడు వీడియో తీశాడు. టిక్ టాక్ లో ఈ వీడియో వైరల్ అయింది. అయితే అతడు స్నానం చేసిన పాలనే మళ్లీ ప్యాకెట్లలో నింపాల్సి ఉండడంతో ఆ వీడియో చూసిన జనాలు మండిపడ్డారు. ఇలాంటి పాలనా తాము రోజూ తాగేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తుండడంతో పోలీసులు స్పందించి ఆ ఘనుడ్ని అరెస్ట్ చేశారు. వీడియో తీసిన వ్యక్తిని కూడా పోలీసులు వదల్లేదు. అంతేకాదు, ఇలాంటి చర్యలకు అవకాశమిస్తున్న ఆ మిల్క్ డెయిరీని మూసివేశారు.