హనీమూన్ కి బయలుదేరుతున్న కాజల్ జంట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హనీమూన్ కి బయలుదేరుతున్న కాజల్ జంట!

Kajal Agarwal goes for Honeymoon
  • ఇటీవలే ప్రియుడిని వివాహమాడిన కాజల్ 
  • సన్నిహితుల మధ్య సింపుల్ గా జరిగిన పెళ్లి
  • హనీమూన్ కి వెళుతున్నట్టు ఈ రోజు హింట్  
ఇటీవలే తన మనసుకు నచ్చిన గౌతమ్ ను పెళ్లాడి.. సంసార జీవితంలోకి ప్రవేశించిన అందాల కథానాయిక కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత కూడా సినిమాలలో నటిస్తానని ఇప్పటికే చెప్పింది. అటు సంసారం.. ఇటు వృత్తి రెంటికీ సమ ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటోంది. ఇక కరోనా నేపథ్యంలో సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహాన్ని జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు భర్తతో కలసి హనీమూన్ ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతోంది.

 ఈ విషయాన్ని కాజల్ డైరెక్టుగా చెప్పనప్పటికీ, ఇన్ స్టాగ్రామ్ లో ఈ రోజు చిన్న హింట్ ఇచ్చింది. బ్యాగేజి, పాస్ పోర్టుల ఫొటోలు పోస్ట్ చేసి.. 'బ్యాగులు సర్దుకున్నాం'.. 'బయలుదేరడానికి సిద్ధంగా వున్నాం' అంటూ ఆ ఫొటోలపై క్యాప్షన్స్ ఇచ్చింది. హనీమూన్ కి వెళుతున్న విషయాన్ని అలా చెప్పకనే చెప్పేసిందన్నమాట. అయితే, ఏ ప్రదేశానికి వెళుతున్నదీ అమ్మడు చెప్పలేదు. నెటిజన్లకు విషయం అర్థం కావడంతో 'హ్యాపీ జర్నీ' అంటూ కాజల్ జంటకు విషెస్ చెబుతున్నారు.
Kajal Agarwal
Goutham
Wedding
Honeymoon

More Telugu News