ఆయన ఇంకా వెళ్లలేదా?: ట్రంప్ ఓడిపోతోన్న నేపథ్యంలో మంచు లక్ష్మి సెటైర్
- అమెరికా ఎన్నికల ఫలితాల్లో జాప్యం
- ట్రంప్ ఓటమి దాదాపు ఖరారు
- సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు
టాలీవుడ్ నటి, మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా ఓ గ్రాఫిక్స్ ఫొటోను పోస్ట్ చేస్తూ సెటైర్ వేసింది. ఇందులో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఓ భవంతి వెనుక నుంచి ముందుకు చూస్తూ ‘ఆయన ఇంకా వెళ్లిపోలేదా’ అని అడుగుతున్నట్లు ఉంది. ఈ ఫొటోను పోస్ట్ చేసిన మంచు లక్ష్మి #USElectionResults2020 హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది.