కోహ్లీపై స్లెడ్జింగ్ చేస్తారేమో... అది మీకే బెడిసికొడుతుంది: ఆసీస్ క్రికెటర్లకు స్టీవ్ వా హెచ్చరిక
- నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన
- కోహ్లీని రెచ్చగొడితే టీమిండియాకు లాభిస్తుందన్న వా
- కోహ్లీ వంటి టాప్ ఆటగాళ్లను వదిలేయడమే మేలని సూచన
రెచ్చగొట్టే మాటలతో కోహ్లీ మరింత పట్టుదలగా ఆడతాడని, టీమిండియా కూడా మరింత సంఘటితం అవుతుందని వివరించాడు. "స్లెడ్జింగ్ తో కోహ్లీని నియంత్రించాలనుకోవద్దు. మాటల యుద్ధం కోహ్లీకి అదనపు ప్రోత్సాహాన్నిస్తుంది. అగ్రశ్రేణి ఆటగాళ్లను మాటలతో రెచ్చగొట్టడం సాధ్యం కాదు. కోహ్లీ వంటి ఆటగాళ్లను వదిలేయడమే మంచిది. కోహ్లీని ఏ మాత్రం కవ్వించినా అది అతని జట్టుకే లాభిస్తుంది" అని ఆసీస్ ఆటగాళ్లకు హితవు పలికాడు.