జగన్ నిర్ణయాలను భవిష్యత్తులో ఏ సీఎం కూడా మార్చలేరు: ఉమ్మారెడ్డి

  • జగన్ పాలన అద్భుతం
  • మేనిఫెస్టోలోని అన్ని అంశాలను నెరవేర్చాం
  • పాలనా సంస్కరణలకు జగన్ నాంది పలికారు
జగన్ పాలన అద్భుతమంటూ వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశంసలు కురిపించారు. పరిపాలనను దివంగత ఎన్టీఆర్ మండల స్థాయి వరకు తీసుకెళ్తే... జగన్ గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లారని అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో జగన్ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని అన్నారు. జగన్ తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి కదల్చలేరని చెప్పారు.

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను మూడు నెలల పాటు శ్రమించి తయారు చేశామని ఉమ్మారెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని చెప్పారు. ఇచ్చిన హామీని నెరవేర్చడం మన బాధ్యత అని జగన్ చెపుతుంటారని అన్నారు. పాలనా సంస్కరణలకు కూడా జగన్ నాంది పలికారని చెప్పారు. కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టించేందుకు ప్రతిపక్షం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... ప్రజల కోసం జగన్ వెనకడుగు వేయడం లేదని అన్నారు.

Ummareddy Venkateshwarlu
Jagan
YSRCP

More Telugu News