రెండు సభల్లో కలిపినా 100 మంది లేరు: కాంగ్రెస్ పై మోదీ సెటైర్లు
- కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉంది
- రాజ్యసభ, లోక్ సభలను కలిపినా 100 మంది సభ్యులు లేరు
- ఏ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు
నిన్న తొమ్మిది మంది బీజేపీ అభ్యర్థులు ఎలాంటి పోటీ లేకుండానే రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో పెద్దల సభలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సభ్యుల సంఖ్య ప్రస్తుతం 112 . మరోవైపు దేశంలోని 14 ప్రధాన రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం. దేశ రాజకీయాలలో చక్రం తిప్పే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా కాంగ్రెస్ కు ఒకే ఒక ఎంపీ ఉన్నారు. వారు ఎవరో కాదు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.