నాని సినిమాలో మరో యంగ్ హీరో!
- ప్రస్తుతం 'టక్ జగదీశ్'లో నటిస్తున్న నాని
- రాహుల్ సాంకృత్యన్ తో 'శ్యామ్ సింగ రాయ్'
- కీలకమైన పాత్ర కోసం నారా రోహిత్?
- కథానాయికలుగా సాయిపల్లవి, కృతి శెట్టి
ఇక, డిసెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో సెట్స్ లో నిర్వహిస్తారు. ఇందులో నాని సరసన కథానాయికలుగా సాయిపల్లవి, కృతి శెట్టి ఇప్పటికే ఎంపికయ్యారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తాడు.
ఇదిలావుంచితే, ఇందులో మరో పవర్ ఫుల్ పాత్ర ఒకటి ఉందట. చిత్రకథకు ఇది కీలకమైన పాత్ర కావడంతో నారా రోహిత్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం రోహిత్ ను సంప్రదిస్తున్నట్టు చెబుతున్నారు. మరి, రోహిత్ ఓకే చెబుతాడా? అనేది త్వరలో తెలుస్తుంది.