కేదార్ నాథ్ ను కమ్మేస్తున్న మంచు!
- దేశంలో వాతావరణ మార్పులు
- మంచులోనే స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు
- రెండు అంగుళాల మేరకు మంచు
అయితే, ఆలయం ఆరు నెలల పాటు మూసివేసేందుకు మరికొంత సమయం ఉండటంతో, భక్తులు ఆ చలి, మంచులోనే స్వామిని దర్శించుకుంటున్నారు. కేదార్ నాథ్ కు వెళ్లే దారిలో దాదాపు రెండు అంగుళాల మేరకు మంచు కూరుకుపోయింది. ఆలయం ఎదుట భక్తులు విశ్రమించేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు సైతం మంచుతో నిండిపోయాయి. అక్కడి భక్తులు మాత్రం ఈ మంచును చూసి మురిసిపోతున్నారు.