బాకీ వసూలు కోసం రెండేళ్ల బాలుడి కిడ్నాప్.. 12 గంటల్లోనే కిడ్నాపర్ల ఆటకట్టు
- తనకు రావాల్సిన రూ. 43 లక్షలు వసూలు చేసేందుకు వ్యాపారి ప్లాన్
- అద్దె కారులో బాలుడి ఇంటికి వచ్చి కిడ్నాప్
- 12 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
అయితే, తనకు ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకుండా నరేశ్ వాయిదాలు వేస్తుండడంతో విసిగిపోయిన ప్రజిత్ కుమార్ బాకీ సొమ్మును ఎలాగైనా రాబట్టుకోవాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా నరేశ్ రెండేళ్ల కుమారుడు మయాంక్‌ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా శనివారం మధ్యాహ్నం అద్దె కారులో భార్య చిన్నురాణితో కలిసి నరేశ్ ఇంటికి వెళ్లిన ప్రజిత్ తాను మాత్రం కారులోనే ఉండి భార్యను లోపలికి పంపాడు.
ఈ క్రమంలో బయట ఆడుకుంటున్న మయాంక్‌ను కారులో ఎక్కించుకుని పరారయ్యాడు. అనంతరం నరేశ్‌కు ఫోన్ చేసి తనకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చి మయాంక్‌ను తీసుకెళ్లాలని చెప్పాడు. దీంతో కంగారుపడిన నరేశ్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నంబరు ఆధారంగా అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు ప్రజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 12 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.