ఔషధ మొక్కల నిలయం 'ఆరోగ్య వన్' ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
- రెండ్రోజుల పాటు ప్రధాని పర్యటన
- మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ కు నివాళులు
కాగా పార్కులో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ వెంట గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఉన్నారు. పార్కు విశేషాలను వారు మోదీకి వివరించారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో లాక్ డౌన్ విధించాక మోదీ గుజరాత్ రావడం ఇదే ప్రథమం. మోదీ తన పర్యటన సందర్భంగా నిన్న మరణించిన గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ కు నివాళులు అర్పించారు.