బైడెన్ అవినీతిని బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారు: అమెరికన్ మీడియాపై ట్రంప్ రుసరుస
- బైడెన్ అవినీతి ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాయి
- ఇలాంటి పక్షపాత వైఖరి చివరికి వారికే నష్టం చేస్తుంది
- బైడెన్ నుంచి మీడియా సంస్థలు, టెక్ కంపెనీలకు లబ్ధి
ఇలాంటి పక్షపాత వైఖరి గతంలో ఎప్పుడూ లేదని, ఇప్పుడే తొలిసారి చూస్తున్నామని అన్నారు. చివరికి ఇది వారికే నష్టం చేస్తుందని హెచ్చరించారు. ఈ ఎన్నికలను ప్రభుత్వ సూపర్ ఎకనమిక్ రికవరీకి, బైడెన్ డిప్రెషన్‌కు మధ్య జరుగుతున్న పోటీగా ట్రంప్ అభివర్ణించారు. ఈ రెండింటిలో ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. కాగా, మాస్కో మేయర్‌కు అత్యంత సన్నిహితుడైన బైడెన్‌కు రష్యా నుంచి 3.5 మిలియన్ డాలర్లు అందినట్టు ట్రంప్ ఇటీవల ఆరోపించారు.