నవరాత్రుల ముగింపు సందర్భంగా కన్యాపూజను నిర్వహించిన యోగి
- గోరక్షపీఠంలో యోగి పూజలు
- తొమ్మిది మంది బాలికలకు పాదాలను కడిగిన సీఎం
- ఉపవాస దీక్ష ముగింపు
ఈ పీఠానికి న్యాయిక్ దండాధికారిగా యోగి వ్యవహరిస్తున్నారు. నాథ్ వర్గీయుల ఆచారాల ప్రకారం యోగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిన్న సాయంత్రం శోభాయాత్రను నిర్వహించారు. తొమ్మిది మంది బాలికల పాదాలను కడిగి, పూజలు నిర్వహించారు. బాలికలకు దక్షిణ సమర్పించి, ఆహార పదార్థాలను అందించారు. అనంతరం తన ఉపవాసాలను ముగించారు.
మహిళలను గౌరవిస్తూ, సంతాన ధర్మం కోసం ఈ కన్యాపూజను నిర్వహిస్తారని ఈ సందర్భంగా యోగి తెలిపారు. పండుగలు ప్రజల జీవితాల్లో సంతోషాన్ని తీసుకొస్తాయని చెప్పారు. అయితే ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని సూచించారు. విధిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పారు.