సోదరుడి ఇంటి వద్ద ఉంటున్న బాలిక.. వ్యభిచార గృహానికి అమ్మేసిన వదిన
- తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో సోదరుడి వద్ద ఉంటున్న బాలిక
- సింగరాయకొండ మహిళకు బాలికను అమ్మేసిన వదిన
- ఇప్పటి వరకు 13 మంది అరెస్ట్
బాలికను కొనుక్కున్న మహిళ కందుకూరు మండలంలోని ఓగూరు సమీపంలో ఆమెతో వ్యభిచారం చేయిస్తోంది. అక్కడి బాధలు భరించలేని బాలిక ఇటీవల వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. తాజాగా, మరో 9 మంది విటులను గుర్తించి వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరికొందరిని కూడా గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.