కాంగ్రెస్ ను వదిలేసినందుకు ఎలాంటి బాధ లేదు: జ్యోతిరాదిత్య సింధియా
- బీజేపీలో సంతోషంగా ఉన్నా
- సామర్థ్యాన్ని బట్టి బీజేపీలో పదవులు ఉంటాయి
- ప్రజా సేవ చేయడమే నా లక్ష్యం
ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, పదవుల కోసం తాను ఎన్నడూ పాకులాడలేదని సింధియా చెప్పారు. ఎనిమిదేళ్ల పాటు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఏనాడు తన కారుపై ఎర్రబుగ్గ పెట్టుకోలేదని అన్నారు. గత 20 ఏళ్లుగా తనను చాలా మంది చూస్తున్నారని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలోనే తనకు తృప్తి ఉందన్నారు. సేవ చేసేందుకు లభించిన అవకాశంగానే రాజకీయాలను చూస్తానని చెప్పారు. తన తండ్రి మాదిరే తనకు కూడా ప్రజాసేవపైనే ఆసక్తి అని తెలిపారు.