టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తోందనే వార్తలపై నిధి స్పందన
- తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదన్న నిధి
- సింగిల్ గానే ఉన్నానని వ్యాఖ్య
- ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న నిధి
ప్రస్తుతం నిధికి సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఓ టాలీవుడ్ హీరోతో ఆమె డేటింగ్ చేస్తోందనేదే ఆ వార్త. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నిధి ఈ అంశంపై స్పందించింది. తాను ఎవరితోను డేటింగ్ లో లేనని, సింగిల్ గానే ఉన్నానని చెప్పింది. మరోవైపు నిధి ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తోంది. హీరో మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ సరసన నటిస్తోంది.