మాస్కులతో ప్రపంచం ముంగిట మరో ముప్పు: హెచ్చరిస్తున్న నిపుణులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాస్కులతో ప్రపంచం ముంగిట మరో ముప్పు: హెచ్చరిస్తున్న నిపుణులు

Face masks are worsening Earths waste problem
  • ప్రపంచవ్యాప్తంగా 66 వేల టన్నుల మాస్కుల వ్యర్థాలు పేరుకుపోయే అవకాశం
  • ఇవి భూమి, జలాల్లో కలవడం ద్వారా మరింత ప్రమాదం
  • మళ్లీ మళ్లీ ఉపయోగించగలిగే మాస్కులనే వాడాలని పిలుపు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం ఉపయోగిస్తున్న మాస్కుల వల్ల మరో అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు చిన్నా, పెద్దా అందరూ మాస్కులు ఉపయోగిస్తున్నారు. అయితే, వీటిలో చాలా వరకు యూజ్ అండ్ త్రో మాస్కులే ఉంటున్నాయి. ఇలా ఏ రోజుకు ఆ రోజు వాడి పారేసే మాస్కుల వల్ల మరింత ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో ప్లాస్టిక్ మాస్కుల వినియోగం మరింత ఎక్కువగా ఉంది. అక్కడి ప్రజలు రోజుకో మాస్కు చొప్పున ఉపయోగిస్తే  ఏడాదికి 66 వేల టన్నుల కలుషిత వ్యర్థాలు, 57 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతాయని అంచనా.

వైరస్ అంటుకున్న మాస్కులు మట్టిలో కూరుకుపోవడం, జలాల్లో కలవడం వల్ల అది మరింత ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిజానికి ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పోరాడుతున్నాయి. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్లాస్టిక్ మాస్కులు, గ్లౌజులను వాడుతున్నారు. కాబట్టి ఇది మరో విపత్తుకు దారితీయక మునుపే అప్రమత్తం కావాలని, భూమిలో కలిసిపోయే మాస్కులను తయారుచేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే, మళ్లీ మళ్లీ ఉపయోగించగలిగే మాస్కులను వినియోగించడం ద్వారా కూడా ఈ ముప్పు నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు.

ఇక, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాస్కులను తయారుచేస్తున్న దేశం చైనానే. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అక్కడి కంపెనీలు రోజుకు 11.60 కోట్ల యూనిట్ల మాస్కులు ఉత్పత్తి చేసేవి. ఇప్పుడు వాటి సామర్థ్యం మరింత పెరిగింది.

ప్రస్తుతం మూడు రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. గుడ్డతో చేసినవి, సర్జికల్, ఎన్-95 మాస్కులు. చివరి రకం మాస్కులు అన్నింటికంటే శ్రేయస్కరం. ఇవి గాలి ద్వారా వచ్చే వైరస్‌లను నియంత్రించగలవు. వీటిలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక, క్లినికల్  మాస్కుల ఉపయోగం కూడా అంతంత మాత్రమే. ఈ రెండింటిని ఎప్పటికప్పుడు పారేయాల్సి ఉంటుంది.
Face mask
Corona Virus
N-95
waste

More Telugu News