హైదరాబాద్‌లో మళ్లీ కంపించిన భూమి.. ఈసారి వనస్థలిపురంలో..
- నగర వాసులను భయపెడుతున్న భూ ప్రకంపనలు
- ఈ తెల్లవారుజామున పలుమార్లు కంపించిన భూమి
- భూమిలోంచి శబ్దాలు రావడంతో భయంతో ప్రజల పరుగులు
తాజాగా, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, వైదేహినగర్‌లలో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోంచి శబ్దాలు కూడా రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్డుపైకి వచ్చారు. 5 గంటల నుంచి ఏడు గంటల మధ్య భూమి పలుమార్లు కంపించినట్టు స్థానికులు తెలిపారు.