సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఇటలీకి బయలుదేరుతున్న కీర్తి సురేశ్
- రామ్-లక్ష్మణ్ లకు మరో భారీ ఆఫర్
- హిందీలో తెలుగు దర్శకుడికి ఇంకో ఛాన్స్
* 'ఆచార్య' తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని మెహర్ రమేశ్ దర్శకత్వంలో చేయనున్నారు. తమిళంలో వచ్చిన 'వేదాళం' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కే ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా రామ్, లక్ష్మణ్ పనిచేస్తారని తెలుస్తోంది.
* ప్రస్తుతం 'భాగమతి' చిత్రాన్ని 'దుర్గావతి' పేరిట హిందీలో భూమి ఫడ్నేకర్ తో రీమేక్ చేస్తున్న తెలుగు దర్శకుడు అశోక్.. తాజాగా మరో హిందీ చిత్రానికి ఓకే చెప్పాడు. నస్రత్ బరూచా, నోరా ఫతేహి ప్రధాన పాత్రలు పోషించే ఈ సినిమా డైలాగులు లేని మూకీ చిత్రంగా తెరకెక్కుతుంది.