ఐపీఎల్ లో నేడు కోల్ కతా వర్సెస్ బెంగళూరు... టాస్ గెలిచిన మోర్గాన్
- అబుదాబిలో మ్యాచ్
- బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా
- ఇరుజట్లకు కీలకంగా మారిన మ్యాచ్ ఫలితం
గత సీజన్లకు భిన్నంగా స్ఫూర్తిదాయక ఆటతీరుతో దూసుకుపోతున్న బెంగళూరు జట్టు మరో విజయంపై కన్నేసింది. అటు బ్యాట్స్ మన్లు, ఇటు బౌలర్లు రాణిస్తుండడం బెంగళూరుకు కలిసొస్తోంది. ముఖ్యంగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండడం మిగతా ఆటగాళ్లకు ప్రేరణ కలిగిస్తోంది. ఇక, బెంగళూరు జట్టులో ఒక మార్పు చేశారు. షాబాజ్ స్థానంలో పేసర్ సిరాజ్ కు స్థానం కల్పించారు.
కోల్ కతా జట్టుకు ఇటీవల ఇయాన్ మోర్గాన్ రూపంలో కొత్త కెప్టెన్ వచ్చాడు. అతడు జట్టును మరింతగా విజయాల బాటలో నడిపిస్తాడని జట్టు మేనేజ్ మెంట్ భావిస్తోంది. ప్లే ఆఫ్ దశ సమీపిస్తున్న నేపథ్యంలో ఇరుజట్లకు ఈ మ్యాచ్ ఫలితం ఎంతో ముఖ్యమైనదే.