Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైఎస్ వల్లే వ్యవసాయం అధోగతి: చంద్రబాబు

దురుద్ధేశంతో వ్యవహరించి ఆనాడు వైయస్ డబ్బులు కొల్లగొట్టడం వల్లే రాష్ట్రంలో వ్యవసాయం అధోగతి పాలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నల్లకుంటలో ’వస్తున్నా మీకోసం‘ పాదయాత్రలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైయస్ పై ఆరోపణలు సంధించారు. మద్యం దుకాణాలలో పనిచేసే వారిని ఆదర్శ రైతులుగా ప్రకటించిన ఘనత వైఎస్ కే దక్కుతుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాబు విమర్శించారు. 

More Telugu News