టీఆర్ఎస్ తో 'సహకారానికి' టీడీపీ సిద్ధం
మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితితో టీడీపీ చేతులు కలపడానికి ముందుకు
వచ్చింది. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడానికి టీఆర్ఎస్
తో సహకారానికి తెలుగుదేశం సిద్ధంగా వుందని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్
రావు చెప్పారు. వరంగల్లులో ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్
తెలంగాణ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున టీఆర్ఎస్ కు అవసరమైన చోట బేషరతు మద్దతు
ఇస్తున్నామని తెలిపారు.