హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న యువకుడి అరెస్టు
- హైదరాబాద్ యువతను లక్ష్యంగా చేసుకుంటూ డ్రగ్స్ అమ్మకం
- నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- విద్యార్థి వీసా మీద వచ్చిన డానియల్
విద్యార్థి వీసా మీద డానియల్ అనే నైజీరియన్ భారత్‌కు వచ్చాడని, ఇక్కడ చదువుకుంటూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు తాజాగా లంగర్ హౌజ్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకుని, అతడి నుంచి ఆరు గ్రాముల కోకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.