ధోనీ@200... రాజస్థాన్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
- అబుదాబిలో నేడు చెన్నై వర్సెస్ రాజస్థాన్
- ఐపీఎల్ లో 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీ
- రెండు మార్పులతో బరిలో దిగుతున్న చెన్నై
ఇక, ముఖ్యమైన అంశం ఏమిటంటే... ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఐపీఎల్ లో 200వ మ్యాచ్. దాంతో అందరి దృష్టి ధోనీపైనే ఉండనుంది. విశేషం ఏంటంటే... తన 50వ, 100వ ఐపీఎల్ మ్యాచ్ లలో ధోనీ నాయకత్వంలో చెన్నై జట్టు విజయం సాధించింది. ఇప్పుడు 200వ మ్యాచ్ లోనూ ధోనీ సేనదే విజయమని అభిమానులు భావిస్తున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే... రాజస్థాన్ రాయల్స్ లో లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ స్థానంలో అంకిత్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. చెన్నై జట్టులో రెండు మార్పులు చేశారు. గాయపడ్డ డ్వేన్ బ్రావో స్థానంలో జోష్ హేజెల్ వుడ్, లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ స్థానంలో పియూష్ చావ్లా జట్టులోకి వచ్చారు.