పాలమూరు దరిద్రానికి కాంగ్రెస్ పార్టీనే కారణం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు
- పాలమూరు ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది
- గత సీఎంలు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు
ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని... అందుకే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే... ప్రజల్లో వారే చులకన అవుతారని అన్నారు. గత ముఖ్యమంత్రులు ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ఎల్లూరు ప్రాజెక్టులో పైపుల మునక సాంకేతిక లోపం అయ్యుండొచ్చని చెప్పారు.