నా గురించి కామెంట్లు చేస్తున్న వారు ఆ పెద్ద మనిషి గురించి ఎందుకు మాట్లాడటం లేదు?: రఘురామకృష్ణరాజు

I go to my constituency before Christmas says Raghu Rama Krishna Raju
  • రఘురామరాజు కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు
  • నియోజకవర్గానికి వెళ్తే అరెస్ట్ చేస్తారన్న ఎంపీ
  • క్రిస్మస్ కు ముందే అక్కడకు వెళ్తానని వ్యాఖ్య
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒకరకమైన కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు సంబంధించిన మరో కామెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికల తర్వాత నుంచి రఘురామ కనిపించడం లేదనేదే ఆ వార్త. దీనిపై రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించారు.

ఈ పోస్టులను తమ వైసీపీ పార్టీకి చెందిన వాళ్లే పెడుతున్నారని... తన నియోజకవర్గానికి వెళ్లేలా తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని... అక్కడకు వెళ్లగానే తనను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని రఘురామ చెప్పారు. తన గురించి కామెంట్లు చేస్తున్న వారు ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడటం లేదని అన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఢిల్లీకి తిరుగుతూ... మిగిలిన సమయాల్లో బయటకే రాని వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. క్రిస్మస్ కి ముందే నియోజకవర్గానికి వస్తానని చెప్పారు.
Go Back to Shorts
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP

More Telugu News