డీకే అరుణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
- మునిగిన కేఎల్ఐ ప్రాజెక్టు మోటార్లను పరిశీలించేందుకు వెళ్లిన అరుణ
- కల్వకుర్తి వద్ద అడ్డుకున్న పోలీసులు
- నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేసిన అరుణ
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అరుణ... కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. మంత్రులను అనుమతించినప్పుడు తనను ఎందుకు అనుమతించడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, అరుణతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.