విశాఖ రాజధాని అంశాన్ని మరోసారి లేవనెత్తిన జగన్!
- దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం తర్వాత జగన్ వ్యాఖ్యలు
- విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నామన్న జగన్
- వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు రోడ్డు నిర్మాణం చేపట్టాలన్న సీఎం
ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత కాన్ఫరెన్సులో జగన్ మాట్లాడుతూ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీచ్ రోడ్ నుంచి భోగాపురం వరకు కోస్టల్ హైవేగా చేపట్టాలని కోరారు. ఐదు పోర్టుల అనుసంధానానికి నిధులు కేటాయించాలని అన్నారు.