చర్యకు ప్రతిచర్య ఇలాగే ఉంటుంది... సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వీడియో ఇదిగో!
- ఓ ఆకతాయి చేష్టపై పోలీసుల కామెంట్
- పశువును కాలితో తన్ని తానే కిందపడిపోయిన ఆకతాయి
- న్యూటన్ మూడవ నియమాన్ని ఉదాహరించిన పోలీసులు
ఇంతకీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పోస్టు చేసిన వీడియోలో ఏముందంటే... ఇద్దరు కుర్రాళ్లు బైక్ వెళుతుండగా... వారిలో వెనుక కూర్చున్న ఆకతాయి రోడ్డుపై ఉన్న పశువును కాలితో తన్నే ప్రయత్నం చేశాడు. కాలితో తన్నే ప్రయత్నంలో బాగా కదలడంతో బండి కుదుపులకు లోనైంది. పశువును తన్నిన కుర్రాడు ఎగిరి రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడిపోగా, బైక్ నడుపుతున్న కుర్రాడు బైక్ ను స్తంభానికి ఢీకొట్టి తాను కూడా కిందపడిపోయాడు. చర్యకు ప్రతి చర్య ఇలా ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.