బెంగళూరుకు కాంగ్రెస్ సురక్షితం కాదు: కుమారస్వామి
- కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య పేలుతున్న మాటలు తూటాలు
- రాజరాజేశ్వరినగర్ ఉపఎన్నికలో పోటీ పడుతున్న ఇరు పార్టీలు
- కాంగ్రెస్ విషయం అందరికీ అర్థమైందన్న కుమారస్వామి
ఇటీవల బెంగళూరులో అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి ఇంటికి నిప్పు పెట్టిన తర్వాత అల్లర్లు జరిగాయి. ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంది. దీనిపై కుమారస్వామి మాట్లాడుతూ, ఇప్పుడు అసలు విషయం అందరికీ అర్థమవుతోందని... బెంగళూరుకు కాంగ్రెస్ సురక్షితం కాదనే విషయం ఓటర్లకు అర్థమైందని అన్నారు. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఓటర్లు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.