పిల్లి సుభాష్ చంద్రబోస్ కు సీఎం జగన్ ఫోన్... ఆత్మీయ పరామర్శ!
- పిల్లి సుబాష్ చంద్రబోస్ కు భార్యావియోగం
- చికిత్స పొందుతూ మృతిచెందిన పిల్లి సత్యనారాయణమ్మ
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్
పిల్లి సుభాష్ చంద్రబోస్ అర్ధాంగి సత్యనారాయణమ్మ గత కొన్నిరోజులుగా హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం నాడు ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఆమె బ్రెయిన్ స్ట్రోక్ కు గురైనట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.