Pooja Hegde: 'రాధే శ్యామ్' నుంచి పూజ హెగ్డే స్టిల్ విడుదల.. చిరునవ్వులు చిందిస్తోన్న బుట్ట బొమ్మ!

introducing Poojahegde as Prerana from RadheShyam
షార్ట్స్‌లో చూడండి
సాహో సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తోన్న రాధే శ్యామ్‌ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలోంచి పూజ హెగ్డే స్టిల్ ను విడుదల చేశారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోన్న పూజ హెగ్డే ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న సందర్భంగా ఆమె అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

చిరునవ్వులు చిందిస్తూ ఆమె కనపడుతోన్న తీరు అలరిస్తోంది. ఈ సినిమాలో పూజ హెగ్డే పేరు ప్రేరణ అని ఈ సినియా యూనిట్ తెలిపింది. ఈ సినిమా పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  

ఈ సినిమాలో పూజ హెగ్డే ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. కాగా, పూజ హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Go Back to Shorts
Pooja Hegde
Prabhas
Radhe Shyam

More Telugu News