నీట్ రాయలేకపోయిన విద్యార్థులకు తీపి కబురు అందించిన సుప్రీంకోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీట్ రాయలేకపోయిన విద్యార్థులకు తీపి కబురు అందించిన సుప్రీంకోర్టు

NEET exam to be conducted for missed students
  • కరోనా వల్ల నీట్ పరీక్ష రాయలేకపోయిన ఎందరో విద్యార్థులు
  • అక్టోబర్ 14న పరీక్షకు అనుమతిస్తున్నట్టు తెలిపిన సుప్రీం
  • అక్టోబర్ 16న వెల్లడి కానున్న ఫలితాలు
ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశం కోసం కేంద్రం నిర్వహించే నీట్ పరీక్షను ఎంతో మంది విద్యార్థులు రాయలేకపోయారు. కరోనా కారణంగా వీరు పరీక్షకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో, పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది. అక్టోబర్ 14న నీట్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నట్టు తెలిపింది.

కరోనాను దృష్టిలో ఉంచుకుని పరీక్షకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఫలితాలను అక్టోబర్ 16న ప్రకటిస్తారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాల్సి ఉంటుంది. విద్యార్థుల చేతులను కూడా శానిటైజ్ చేస్తారు. మరోవైపు సుప్రీం నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NEET
Exam
Supreme Court

More Telugu News