ధోనీ కూతురుకి బెదిరింపులపై అఫ్రిది స్పందన!
- భారత క్రికెట్ ను ధోనీ కొత్త పుంతలు తొక్కించాడు
- అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు
- ఆటను ఆటగానే చూడాలి
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అఫ్రిదీ స్పందించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నాడు. భారత క్రికెట్ ను కొత్తపుంతలు తొక్కించిన వ్యక్తి ధోనీ అని... సీనియర్లు, జూనియర్లను కలుపుకుపోయి భారత్ క్రికెట్ ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడని, అలాంటి వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని అన్నాడు. ఆటను ఆటగా మాత్రమే చూడాలని హితవు పలికాడు.