బెయిలుపై విడుదలైన కాసేపటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియ మళ్లీ అరెస్ట్
- శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన మధుప్రియ
- చీటింగ్ కేసులో మరోమారు అరెస్ట్
- ఈ నెల 20 వరకు రిమాండ్
తన ఇంట్లో పనిచేసి మానేసిన దళిత యువకుడు శ్రీకాంత్‌కు ఆగస్టు 28న ఇంట్లోనే శిరోముండనం చేయించిన ఘటన అప్పట్లో పెను సంచలనమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులో తొలుత మధుప్రియతోపాటు మరికొందరిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న నూతన్ నాయుడును ఆ తర్వాత అరెస్ట్ చేశారు. తాజాగా, మధుప్రియ బెయిలుపై బయటకు రాగా, కాసేపటికే చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు.