యూపీలో పరువు హత్య: 16 ఏళ్ల బాలికను అతి దారుణంగా చంపేసిన తండ్రి, సోదరుడు
- గర్భం దాల్చిన 16 ఏళ్ల దళిత బాలిక
- పరువుపోయిందని హింసించి గొంతు కోసి చంపేసిన వైనం
- బాలిక తలను శరీరం నుంచి వేరుచేసి ఖననం
- తప్పును ఒప్పుకున్న తండ్రి
అనంతరం బాలిక తలను శరీరం నుంచి వేరుచేసి ఖననం చేశారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు తెలిపారు. షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ బాలిక పెళ్లి కాకుండా గర్భం దాల్చింది. దీంతో గ్రామంలో ఆమె కారణంగా తమ పరువుపోతోందని ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి, సోదరుడు కలసి బాలికను దారుణంగా హత్య చేసి, ఖననం చేశారు.
గత నెల 23న ఆ బాలిక అదృశ్యమైందని, అయినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహం లభ్యం కావడంతో కేసును ఛేదించామని చెప్పారు. ఆ బాలిక తండ్రి నేరాన్ని అంగీకరించాడని, ఆమె సోదరుడు పరారీలో ఉన్నాడని వివరించారు. మైనర్ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరమని, ఆమెకు గర్భం రావడానికి బాధ్యుడైన వారిని పట్టుకుంటామని చెప్పారు.