విశాఖలో ఓ సైకో బీభత్సం సృష్టించాడు. విశాఖ శివారు ప్రాంతంలోని కొమ్మాది అమరావతి కాలనీలో ఓ యువకుడు కత్తి పట్టుకుని రోడ్డుపైకి వచ్చి ఓ మహిళ, చిన్నారిపై దాడి చేశాడు. గొంతుకోసి పారిపోయేందుకు యత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. ఆ ఉన్మాది వారిపైనా దాడికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు అతడ్ని పట్టుకుని చితకబాదారు. సైకో దాడిలో గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఒడిశాకు చెందినవారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోతినమల్లయ్య పాలెం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సైకోను పట్టుకున్న స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.