సన్ రైజర్స్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్
- సన్ రైజర్స్ బౌలింగ్ లో ఛేజింగ్ కష్టమని భావించిన రోహిత్
- భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్ కు విశ్రాంతి
- సందీప్ శర్మ, కౌల్ లకు సన్ రైజర్స్ జట్టులో చోటు
కాగా, రెండు జట్లు టోర్నీలో ఇప్పటివరకు నాలుగేసి మ్యాచ్ లు ఆడాయి. రెండు విజయాలు, రెండు ఓటములు నమోదు చేశాయి. ఆయా జట్ల వివరాలు పరిశీలిస్తే... సన్ రైజర్స్ బౌలింగ్ విభాగంలో మార్పులు చేశారు. గత మ్యాచ్ లో గాయపడిన భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ లకు విశ్రాంతి ఇచ్చారు. వారిద్దరి స్థానంలో సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్ జట్టులోకి వచ్చారు. ముంబయి ఇండియన్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అందరు ఆటగాళ్లు ఫిట్ గా ఉండడం ఆ జట్టుకు అదనపు బలం అని చెప్పాలి.