ఏపీ కరోనా అప్ డేట్: 6,224 పాజిటివ్ కేసులు, 41 మరణాలు
- గత 24 గంటల్లో 72,861 శాంపిల్స్ పరీక్ష
- అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 890 కేసులు
- కృష్ణా జిల్లాలో ఆరుగురి మృతి
- తాజాగా 7,798 మందికి కరోనా నయం
ఓవరాల్ గణాంకాలు చూస్తే, రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,13,014కి చేరింది. ఇప్పటివరకు 6,51,791 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 55,282 మంది చికిత్స పొందుతున్నారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 5,941కి పెరిగింది.