మా కుటుంబానికి కరోనా వ్యాక్సిన్ అవసరంలేదు: ఎలాన్ మస్క్
- వ్యాక్సిన్ వచ్చినా తాము స్వీకరించబోమన్న మస్క్
- వైరస్ లు రావడం సాధారణ విషయమని వెల్లడి
- వాటికి భయపడడం అర్థరహితమని వ్యాఖ్యలు
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలాన్ మస్క్ కు కొత్త కాదు. కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో ఆయన మాట్లాడుతూ, మాస్కులు వేసుకోవడం వల్ల వైరస్ సోకదని భావించడం అర్థరహితం అన్నారు. కరోనాను దూరం పెట్టేందుకు లాక్ డౌన్ విధించడం సరికాదని పేర్కొన్నారు.
ఈ వైరస్ తో ముప్పు ఉన్నవాళ్లను మాత్రమే ఇళ్లకు పరిమితం చేస్తే సరిపోయేదని, ప్రతి ఒక్కరిని ఇంట్లో నిర్బంధించడం మంచి ఆలోచన కాదని అభిప్రాయపడ్డారు. ఇక, కరోనాతో భారీ జననష్టం జరగడంపైనా వేదాంత ధోరణిలో బదులిచ్చారు. పుట్టినవాళ్లు ఎప్పుడో ఒకప్పుడు గిట్టక మానరని సెలవిచ్చారు.