హిందూ దేవాలయాలపై దాడుల నేపథ్యంలో హోమం చేస్తున్నాం: శ్రీనివాసానంద
- కొన్ని నెలలుగా హిందూ దేవాలయాల్లో అపచారం
- ఈ తీరు దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మంచిది కాదు
- ఆలయాలను మనం కాపాడాలి
- అవి మనల్ని కాపాడతాయి
ఈ ఘటనపై దేవాలయ ధర్మాదాయ శాఖ అరిష్ట నివారణ శాంతి హోమాలు చేయాలని, అయితే ఈ పని చేయట్లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తామే ఈ హోమం చేస్తున్నామని వివరించారు. ఆలయాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని చెప్పుకొచ్చారు. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దాడులు జరుగుతున్నప్పటికీ ఆ విషయాలపై స్పందించకుండా మౌనం వహిస్తోన్న ప్రజాప్రతినిధులకు దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.