హత్రాస్ ఘటన క్రూరం, అమానవీయం: కోహ్లీ
- నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
- చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలు
- సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పోరాటానికి కోహ్లీ మద్దతు
యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన నలుగురు మృగాళ్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుక తెగ్గోయడం వారి పైశాచికత్వానికి నిదర్శనం. తీవ్ర గాయాలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు నిన్న ప్రాణాలు విడిచింది. హత్రాస్ ఘటన 2012 నాటి నిర్భయ కేసును గుర్తుకు తెచ్చింది.