ఏపీలో స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం మరోసారి వాయిదా
- అక్టోబరు 5 నుంచి స్కూళ్ల రీఓపెనింగ్ అంటూ గతంలో ప్రకటన
- తాజా నిర్ణయంతో నవంబరు 2 నుంచి స్కూళ్లు
- జగనన్న విద్యాకానుక యథాతథం
ఇక, పాఠశాలల ప్రారంభంతో సంబంధం లేకుండా జగనన్న విద్యాకానుక పథకాన్ని మాత్రం అక్టోబరు 5న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కానుకలో భాగంగా పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర స్టేషనరీ వస్తువులతో కూడిన ఓ కిట్ బ్యాగ్ ను విద్యార్థులకు అందిస్తారు.