కేంద్ర పోలీసు బలగాలపై కరోనా పంజా.. 36 వేల మందికి కొవిడ్
- కరోనా కారణంగా 120 మంది మృతి
- ఇంకా యాక్టివ్‌గా 6 వేల కేసులు
- బీఎస్ఎఫ్‌లో 10,636 మందికి కరోనా
ఇక, వైరస్ బారినపడిన వారిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులలో విధులు నిర్వర్తించే బీఎస్ఎఫ్ సిబ్బంది ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటి వరకు 10,636 మంది కరోనా బారినపడ్డారు. సీఆర్‌పీఎఫ్‌లో 10,602 మంది, సీఐఎస్ఎఫ్‌లో 6,466 మంది, ఐటీబీపీలో 3,845 మంది, ఎస్ఎస్‌బీలో 3,684 మంది, ఎన్‌డీఆర్ఎఫ్‌లో 514 మంది, ఎన్ఎస్‌జీలో 250 మందికి ఈ మహమ్మారి సోకింది. వైరస్ కారణంగా సీఆర్‌పీఎఫ్‌లో 52 మంది, బీఎస్ఎఫ్‌లో 29 మంది, సీఐఎస్ఎఫ్‌లో 28 మంది ప్రాణాలు కోల్పోగా, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీలలో 9 మంది చొప్పున మృతి చెందారు.