నోటితో దళిత జపం చేస్తూ నొసటితో వెక్కిరిస్తున్నారు: చంద్రబాబుపై సజ్జల విమర్శలు
- అధికారంలో ఉన్నప్పుడు దళితులకు ఏంచేశారన్న సజ్జల
- ఇప్పుడు జగన్ సర్కారుకు అడ్డుపడుతున్నారంటూ వ్యాఖ్యలు
- దళితులకు తీరని ద్రోహం చేస్తున్నారంటూ ట్వీట్
"పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వాటిని అడ్డుకోలేదా? దీనివల్ల నష్టపోతున్నది దళితులు కాదా?" అంటూ సజ్జల నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువు వల్ల దళితులు, పేదల పిల్లలు బాగుపడరా? దీనికి మోకాలొడ్డింది మీరు కాదా? అంటూ ట్వీట్ చేశారు.
"రాష్ట్ర ఎన్నికల కమిషర్ గా దళితుడైన రిటైర్డ్ హైకోర్డు జడ్జిని నియమిస్తే, మీ అనుయాయుడైన నిమ్మగడ్డ రమేశ్ కోసం కోర్టుల ద్వారా ఆయనను అడ్డుకోలేదా? మీరు నోటితో దళిత జపం చేస్తూ నొసటితో వెక్కిరిస్తున్నారు. మీ చేష్టలతో దళితులకు తీరని ద్రోహం చేస్తున్నారు" అంటూ విమర్శించారు.